Abn logo
Jan 17 2021 @ 15:28PM

కంగనా రనౌత్‌కు లీగల్‌ నోటీసులు

బాలీవుడ్‌ కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్‌కు లీగల్‌ నోటీసులు అందాయి. అసలు ఏమైందే అనే వివరాల్లోకెళ్తే.. కంగనా రనౌత్‌ రీసెంట్‌గా మణికర్ణిక సీక్వెల్‌గా 'మణికర్ణిక.. ది లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా' పేరుతో కాశ్మీరీ రాణి జీవితగాథను తెరకెక్కించాలని అనుకుంది. అయితే ఈ విషయంలో ఆశిష్‌ కౌల్‌ అనే వ్యక్తి కంగా రనౌత్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. ఇంతకీ ఆశిష్‌ కౌల్‌ ఎవరా? అనే అనుమానం రాక మానదు. ఈయన ఓ రైటర్‌. కాశ్మీరీ రాణి జీవితగాథను 'దిద్దా.. కాశ్మీర్ కీ యోధా రాణి' పేరుతో పుస్తక రూపంలో ప్రచురించాడు. 2017లోఈ పుస్తకం ఇంగ్లీష్‌ వెర్షన్‌ కూడా విడుదలైంది. కాశ్మీర్‌ రాణి దిద్దా జీవితగాథకు సంబంధించి అశిష్‌ కౌల్‌ హక్కులను కలిగి ఉన్నాడు. తన అనుమతి లేకుండా కంగనా రనౌత్‌ దిద్దా జీవిత చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కించడాన్ని ఆశిష్‌ కౌల్‌ తప్పు పడుతూ కంగనా రనౌత్‌కు నోటీసులు పంపాడు. మరి ఈ లీగల్‌ నోటీసులపై కంగనా రనౌత్‌ అండ్‌ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement