Abn logo
Jan 16 2021 @ 20:04PM

ఇక ఆగలేను.. వ్యాక్సినేషన్‌పై నటి కంగన రనౌత్

ముంబై: కరోనా మహమ్మారితో అల్లాడిపోయిన దేశానికి నేటితో ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉదయం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఆ వెంటనే దేశ్యాప్తంగా ముందుగా ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాల్లోనూ ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సిన్లు ఇవ్వడం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆ సంస్థ డైరెక్టర్ రణదీప్ గులేరియా వ్యాక్సిన్ షాట్ తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఈ వీడియోను చూసిన వెంటనే స్పందించారు. ఆ దృశ్యాన్ని అద్భుతం అంటూ కొనియాడిన కంగన.. టీకా తీసుకోవడానికి ఆతృత కనబరిచారు. ‘అద్భుతం.. ఇక నేను ఆగలేను’ అంటూ ట్వీట్ చేశారు. కంగన ప్రస్తుతం తన సినిమా ‘ధాకడ్’ షూటింగ్ నిమిత్తం భోపాల్‌లో ఉన్నారు. అలాగే, ‘మణికర్ణిక’ సినిమాకు సీక్వెల్‌‌గా మరో సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో ‘క్లియోపాత్ర ఆఫ్ కశ్మీర్’గా పేరుగాంచిన రాణి దిద్దా పాత్రలో నటించనున్నారు. 10-11 శతాబ్దాల్లో ఆమె కశ్మీర్ లోయను పాలించారు. 


Advertisement
Advertisement
Advertisement