May 5 2021 @ 00:37AM

ట్విట్టర్‌ నుంచి కంగన సస్పెండ్‌

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ట్విట్టర్‌ అధికారిక ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కంగన మంగళవారం తెలిపారు. ‘‘ట్విట్టర్‌ అమెరికా సంస్థ. తెల్ల రంగుచర్మం కలిగిన వాళ్లు గోధుమ రంగు చర్మం కలిగిన వాళ్లని నియంత్రించాలని చూస్తున్నారు.  ఏం మాట్లాడాలో.. మాట్లాడకూడదో కూడా వాళ్లే నిర్ణయించాలనుకుంటున్నారు. ఇకపై ఇతర వేదికలు, సినిమాల ద్వారా నా గొంతు వినిపిస్తాను’’ అని కంగన తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను గురించి మమతా బెనర్జీపై కంగన అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారు. దీంతో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నందుకు కంగన ఖాతాను శాశ్వతంగా రద్దు చేస్తూ ట్విట్టర్‌ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు.