కాంగ్రెస్‌లో చేరనున్న కన్నయ్య కుమార్!

ABN , First Publish Date - 2021-09-16T16:58:16+05:30 IST

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్‌యూ) పూర్వ విద్యార్థి...

కాంగ్రెస్‌లో చేరనున్న కన్నయ్య కుమార్!

న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్‌యూ) పూర్వ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇటీవలే కన్నయ్య కుమార్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలుసుకున్నారు. కాంగ్రెస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం... గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కలసి పనిచేయాలని కన్నయ్య కుమార్‌ను పార్టీ కోరినప్పటికీ అది సాధ్యం కాలేదు. 


అయితే ఇటీవలే కన్నయ్య కుమార్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఈ నేపధ్యంలో పార్టీ కన్యయ్య కుమార్ సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ బీహార్‌కు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనుంది. ఆ తరువాత కన్నయ్య కుమార్ ఎంట్రీ ఉండవచ్చని సమాచారం. జెఎన్‌యూ విద్యార్థి నేతగా కన్నయ్య కుమార్ వివాదాస్పద నినాదాలు చేసి చర్చల్లో నిలిచారు. అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు.

Updated Date - 2021-09-16T16:58:16+05:30 IST