సడలింపుతో ట్రాఫిక్‌ అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2020-08-05T11:35:35+05:30 IST

కరోనా మహమ్మారి విస్తృతమవుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ నిబంధనలు ట్రాఫిక్‌ దిగ్బంధనానికి ..

సడలింపుతో ట్రాఫిక్‌ అస్తవ్యస్తం

కనిగిరిలో ఒకే వీధిలో భారీ సంఖ్యలో

వాహనాల రాకపోకలు

తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం

అల్లాడిపోతున్న  పట్టణ ప్రజలు


కనిగిరి, ఆగస్టు 4 : కరోనా మహమ్మారి విస్తృతమవుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ నిబంధనలు ట్రాఫిక్‌ దిగ్బంధనానికి దారితీస్తున్నా యి. పట్టణంలోని స్టేట్‌బ్యాంక్‌కు వెళ్లే మలుపు ఐస్‌పార్లర్‌ వద్ద, సుగుణమ్మ హాస్పిటల్‌, బొడ్డుచావిడి, గార్లపే ట బస్టాండ్‌, చెప్పులకొట్టు బజార్లలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పాదచారులు, వాహనదారులు తీగలగొందిలోనే రావాల్సిన పరిస్థితి.


ఎంపీడీవో కార్యాలయం, గార్లపేటరోడ్డు, ఎమ్మెస్సార్‌ రోడ్డుకు వెళ్లాలం టే తీగలగొందిలో నుంచే ప్రతి వాహనం రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్లు, ట్రాక్టర్లు, భారీ వాహనాలు సైతం వెళ్లాల్సిఉండడంతో తరచూ ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. నిబంధన మంచిదే అయినా లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో వాహనాల రద్దీ పెరిగి చికాకు పుట్టిస్తోంది. ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా తగినంత మంది సిబ్బందిని నియమించేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు.  

Updated Date - 2020-08-05T11:35:35+05:30 IST