Abn logo
Sep 10 2021 @ 08:33AM

AP: కాణిపాకం ఆలయంలో వినాయక చవితి శోభ

చిత్తూరు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలో వినాయకచవితి శోభ సంతరించుకుంది. బొజ్జగణపయ్యను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి  భక్తులు ఆలయానికి పోటెత్తారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ వరసిద్ధి వినాయకుడిని భక్తులు దర్శించుకుంటున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని  దేవస్థానం అధికారులు ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి కాణిపాకం ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. కాణిపాకం వినాయకునికి  ఉభయదారులు మహదేవనాయుడు కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించారు.