పంట రుణాలపై కన్నబాబు ప్రకటన

ABN , First Publish Date - 2021-03-26T21:53:27+05:30 IST

ఈ ఆర్ధిక సంవత్సరానికి 2.31 లక్ష కోట్లు క్రెడిట్ ప్లాన్‌గా నాబార్డు నిర్ధారించిందని మంత్రి కన్నబాబు తెలిపారు.

పంట రుణాలపై కన్నబాబు ప్రకటన

అమరావతి: ఈ ఆర్ధిక సంవత్సరానికి 2.31 లక్ష కోట్లు క్రెడిట్ ప్లాన్‌గా నాబార్డు నిర్ధారించిందని మంత్రి కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1.58 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలుగా నిర్ధారించారని చెప్పారు. 1.13 లక్షల కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలన్నది లక్ష్యమన్నారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు వెనుకాడటం తగదని హితవుపలికారు. 4 లక్షలకు పైగా కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు జారీ చేశామని ప్రకటించారు. 2900 కోట్లతో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 500 కోట్లతో మార్కెట్ యార్డుల ఆధునీకరిస్తామన్నారు. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా ప్రాథమికస్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి చేస్తామన్నారు. 13 వేల కోట్లతో ప్రాజెక్టు సిద్ధం చేస్తున్నామని కన్నబాబు ప్రకటించారు.

Updated Date - 2021-03-26T21:53:27+05:30 IST