Abn logo
Aug 15 2020 @ 00:48AM

స్నేహితురాలి మర్డర్‌ మిస్టరీ

ఆఫ్రీన్‌ సిద్థు, నాస్టియా రాయ్‌, నిశాంత్‌ వాలియా, ఆర్జే పృథ్వీ కీలక పాత్రధారులుగా కన్నడంలో రూపొందిన ‘బ్లూ ఐస్‌’ సినిమా తెలుగులో అనువాదమవుతోంది. రవళి చౌదరి సమర్పణలో మాదల రామకృష్ణ త్వరలో ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజేశ్‌ మూర్తి ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘స్నేహితురాలి మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆ హత్యా రహస్యాన్ని ఛేదించడానికి మిగిలిన స్నేహితులు ఎలాంటి ప్రయత్నం చేశారన్నది కథ. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది’’ అని దర్శకుడు చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement