Abn logo
May 27 2020 @ 21:02PM

రోడ్డు ప్రమాదంలో సినీ నటి మెబీనా మైఖేల్ దుర్మరణం

బెంగళూరు: కన్నడ టీవీ నటి మెబీనా మైఖేల్ రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తూ దుర్మరణం చెందింది. ఆమె వయసు 22 సంవత్సరాలు. తన స్వస్థలమైన మడికెరికి కారులో వెళుతుండగా ఓ ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆమె స్నేహితులు కోలుకోగా.. మెబీనా మైఖేల్ తీవ్ర గాయాల పాలై మృతి చెందింది. దేవిహళ్లి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.


మెబీనా మైఖేల్ తక్కువ వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి రాణించింది. ‘ప్యాటే హుడుగిర్ హళ్లి లైఫ్’ అనే రియాల్టీ షో టైటిల్‌ను సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ రియాల్టీ షో టైటిల్‌తో పాటు ప్రైజ్ మనీ 7 లక్షలను సొంతం చేసుకుంది. అంతేకాదు.. 2018లో మైఖేల్ డ్యాన్స్ స్టూడియో పేరుతో డ్యాన్స్ స్టూడియోను కూడా ప్రారంభించింది.

Advertisement
Advertisement
Advertisement