యువతి వెనుక నెల్లాళ్లుగా బీజేపీ నేత... చెప్పు తెగడంతో...

ABN , First Publish Date - 2020-09-10T16:32:49+05:30 IST

యూపీలోని కాన్పూర్‌లో బీజేపీ నేత నెల్లాళ్లుగా ఒక యువతి వెంటపడుతూ, చివరికి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. సదరు బీజేపీ నేత ఆ యువతి వెంటపడుతూ తనతో స్నేహం చేయాలని కోరుతున్నాడు. ఈ విషయాన్ని...

యువతి వెనుక నెల్లాళ్లుగా బీజేపీ నేత... చెప్పు తెగడంతో...

కాన్పూర్: యూపీలోని కాన్పూర్‌లో బీజేపీ నేత నెల్లాళ్లుగా ఒక యువతి వెంటపడుతూ, చివరికి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. సదరు బీజేపీ నేత ఆ యువతి వెంటపడుతూ తనతో స్నేహం చేయాలని కోరుతున్నాడు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులంతా ఆ బీజేపీ నేతను చెప్పులతో కొట్టి, పోలీసులకు అప్పగించారు. యువతిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత మనీష్ పాండ్యా... గోవిందనగర్ అసెంబ్లీ సీటు పరిధిలోని కల్యాణ్‌పూర్ ప్రాంత బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు. 



ఆ యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బీజేపీ నేత మనీష్ నెల్లాళ్లుగా ఆమె వెనుక తిరుగుతున్నాడు. ఈ నేపధ్యంలో ఆ యువతి తన కుటుంబ సభ్యుల సహకారంతో ఆ బీజేపీ నేతను రోడ్డుపై నిర్బంధించి చెప్పులతో కొట్టింది. దీంతో అక్కడున్నవారంతా కూడా ఆ బీజేపీ నేతపై చెప్పులతో దాడి చేశారు. తరువాత  అతనిని పోలీసులకు అప్పగించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. 

Updated Date - 2020-09-10T16:32:49+05:30 IST