Abn logo
Sep 10 2021 @ 10:37AM

Kanpur: డాక్టర్ డ్రైవరు బుర్ఖాతో మహిళా వార్డులోకి వచ్చి ఏం చేశాడంటే...

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): డాక్టరు వద్ద డ్రైవరుగా పనిచేస్తున్న యువకుడు బురఖా వేసుకొని మహిళా రోగుల వార్డులోకి వెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా ఆసుపత్రిలో వెలుగుచూసింది. సల్వార్, కుర్తా ధరించిన డ్రైవరు మహిళా డాక్టరు వేషంలో బురఖా వేసుకొని మహిళల వార్డులోకి వచ్చాడు. బాడీ లాంగ్వేజ్ చూసిన రోగులు కేకలు వేయడంతో అతను ఎమర్జెన్సీ వార్డుకు పరుగెత్తాడు. వెంటాడిన ఆసుపత్రి సిబ్బంది అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.బురఖా వేసుకున్న వ్యక్తి మహిళల దుస్తులు వేసుకున్నాడని తేలింది. డ్రైవరు మానసిక అనారోగ్యంతో ఉన్నాడని, అతను లేడీస్ టాయిలెట్ కు వెళ్లేందుకు బురఖా ధరించాడని దర్యాప్తులో తేలిందని పోలీసు అధికారి అరుణ్ కుమార్ సింగ్ చెప్పారు.

క్రైమ్ మరిన్ని...