కొనసాగుతున్న కరనా సెకెండ్ వేవ్... కోట్లాది రూపాయల ఆర్డర్లు క్యాన్సిల్!

ABN , First Publish Date - 2020-12-03T17:40:29+05:30 IST

ఈమధ్యనే తమ వ్యాపారాలను పట్టాల మీదకు తీసుకువచ్చిన వ్యాపారుల ఆశలను కరోనా సెకెండ్ వేవ్ హరించివేస్తోంది.

కొనసాగుతున్న కరనా సెకెండ్ వేవ్... కోట్లాది రూపాయల ఆర్డర్లు  క్యాన్సిల్!

కాన్పూర్: ఈమధ్యనే తమ వ్యాపారాలను పట్టాల మీదకు తీసుకువచ్చిన వ్యాపారుల ఆశలను కరోనా సెకెండ్ వేవ్ హరించివేస్తోంది. పెరుగుతున్న కరోనా గ్రాఫ్, యూరప్‌లో లాక్‌డౌన్ విధిస్తారన్న అనుమానాల మధ్య కోట్లాది ఆర్డర్లు క్యాన్సిల్ అవడమో లేదా హోల్డింగ్‌లో పెట్టడమో జరుగుతోంది. యూపీలోని కాన్పూర్‌లో రూ. 150 కోట్ల నిర్ణీత ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యాయి. వీటి ప్రభావం ముఖ్యంగా రెడీమేడ్, ఎలక్ట్రానిక్స్ మార్కెట్లపై పడింది.


మీరట్‌లో 40 కోట్ల రూపాయల విలువ చేసే ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యాయి. అలాగే బెనారస్, దాని చుట్టుపక్కల జిల్లాలో 250 కోట్ల రూపాయల మేరకు ఆర్డర్లు తాత్కాలికంగా క్యాన్సిల్ అయ్యాయి. మరో 150 కోట్ల రూపాయల ఆర్డర్లు హోల్డ్‌లో ఉండిపోయాయి. దేశంలో అతిపెద్ద రెడీమేడ్ బజారు యూపీలోని కాన్పూర్‌లో ఉంది. యూపీ రెడీమేడ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ధీరజ్ షా మాట్లాడుతూ నవరాత్రులలో రెడీమేడ్ దుకాణాలలో విక్రయాలు బాగా సాగాయి. అయితే గత వారం రోజులుగా విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. లాక్‌డౌన్ వేస్తారేమోన్న భయంతో వ్యాపారాలు మందగించాయి. గడచిన ఐదు రోజుల్లో రెడీమేడ్ వస్త్ర వ్యాపారం 25 శాతం మేరకు పడిపోయిందని తెలిపారు. 


Updated Date - 2020-12-03T17:40:29+05:30 IST