Kanpur Test: తొలి ఇన్నింగ్స్‎లో టీమిండియా 345 పరుగులకు ఆలౌట్

ABN , First Publish Date - 2021-11-26T18:05:46+05:30 IST

న్యూజిలాండ్‎తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‎లో భారత్ జట్టు 345 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ రెండో రోజు ఆటను 258/4తో ప్రారంభించింది. ఆట ఆరంభంలోనే సౌథీ బౌలింగ్‎లో జడేజా..

Kanpur Test: తొలి ఇన్నింగ్స్‎లో టీమిండియా 345 పరుగులకు ఆలౌట్

కాన్పూర్: న్యూజిలాండ్‎తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‎లో భారత్ జట్టు 345 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్  రెండో రోజు ఆటను 258/4తో ప్రారంభించింది. ఆట ఆరంభంలోనే సౌథీ బౌలింగ్‎లో జడేజా(112 బంతుల్లో 4 ఫోర్లతో 50) పరుగులు చేసి వెనుతిరిగాడు. ఇక అరంగేట్రం టెస్టులోనే శ్రేయస్ అయ్యర్ శతకం సాధించాడు. తనదైన స్టైల్‎లో 157 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌథీ వేసిన 96.1 ఓవర్‎లో విల్‎కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ 105 పరుగుల వద్ద అవుటయ్యాడు.  తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ 38, సాహా 1, అక్షర్ పటేల్ 3, ఇషాంత్ శర్మ డకౌటయ్యాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‎లో 111.1 ఓవర్లలో 345 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలింగ్‎లో టీమ్ సౌథీ ఐదు వికెట్లు తీసుకోగా, జేమీసన్ 3, అజీజ్ పటేల్‎కు రెండు వికెట్లు దక్కాయి.

Updated Date - 2021-11-26T18:05:46+05:30 IST