వివేకా హత్యకేసులో సీబీఐ ఓ ప్రకటన ఇచ్చింది: రఘురామ

ABN , First Publish Date - 2021-08-21T20:01:58+05:30 IST

వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ ఓ ప్రకటన ఇచ్చిందని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హత్యకేసుకు సంబంధించి

వివేకా హత్యకేసులో సీబీఐ ఓ ప్రకటన ఇచ్చింది: రఘురామ

ఢిల్లీ: వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ ఓ ప్రకటన ఇచ్చిందని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హత్యకేసుకు సంబంధించి నిజాలు తెలిపినవారికి రూ.5లక్షలు అంటున్నారని, సాక్ష్యం చెప్పేందుకు వచ్చేవారికి సీఎం జగన్ రూ.కోటి బహుమానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తే వెంటనే పట్టుకుంటున్నారని తెలిపారు. ఈ కేసులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి గతంలోనే హత్యకు గురయ్యాడని తెలిపారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా రక్షణ కోరారని పేర్కొన్నారు. సీబీఐ ప్రకటనతో వివేకా హత్యకేసు త్వరగా పూర్తవుతుందని అనుకుంటున్నానని చెప్పారు. రాష్ట్రంలోని 29 కార్పొరేషన్లపై అప్పులు తీసుకోవాలని చూస్తున్నారని, తప్పుడు పద్ధతిలో కార్పొరేషన్లు పెట్టి అప్పులు చేయడం మంచిది కాదని సూచించారు. ఏపీ మద్యం ఆదాయం ఎక్కడికి పోతోందని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

Updated Date - 2021-08-21T20:01:58+05:30 IST