Abn logo
Aug 1 2020 @ 03:17AM

ఆ ముగ్గురి కంటే నేనే బెటర్‌!

న్యూఢిల్లీ: అప్పటి తన సహచర ఆటగాళ్లు ఇయాన్‌ బోథమ్‌, రిచర్డ్‌ హ్యాడ్లీ, ఇమ్రాన్‌ ఖాన్‌లతో పోలిస్తే తానే మంచి అథ్లెట్‌నని దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ తెలిపాడు. అయితే క్రికెట్‌ నైపుణ్యంలో వారికంటే ఉత్తమం కాదని స్పష్టం చేశా డు. ‘వారందరిలో నేనే గ్రేటెస్ట్‌ అని చెప్పడం లేదు కానీ కచ్చితంగా ఉత్తమ అథ్లెట్‌నే. మా అందరిలో హ్యాడ్లీ మెరుగైన బౌలర్‌. ఇమ్రాన్‌లో సహజ నైపుణ్యం ఉండేది. ఇక బోథమ్‌ నిజమైన ఆల్‌రౌండర్‌. బ్యాట్‌తో, బంతితో ప్రత్యర్థి పనిపట్టేవాడ’ని కపిల్‌ చెప్పుకొచ్చాడు.

Advertisement
Advertisement
Advertisement