రణ్‌వీర్‌కు కపిల్‌ అభినందనలు

ABN , First Publish Date - 2020-11-22T05:53:45+05:30 IST

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ‘83’ చిత్రంలో కపిల్‌ పాత్రను రణ్‌వీర్‌ సింగ్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో కపిల్‌ దేవ్‌ ఈ సినిమా అంటే పెద్దగా ఆసక్తి చూపించలేదట. తన పాత్రను రణ్‌వీర్‌పోషిస్తున్నాడనీ, తన భార్య రోమీ పాత్రను దీపిక పోషిస్తుందని తెలుసుకొని పెద్దగా స్పందించలేదు. ఈ విషయాన్ని కపిల్‌ ఇటీవల వెల్లడిస్తూ ‘రణ్‌వీర్‌ సినిమాలు నేను చూడలేదు...

రణ్‌వీర్‌కు కపిల్‌ అభినందనలు

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ‘83’ చిత్రంలో కపిల్‌  పాత్రను రణ్‌వీర్‌ సింగ్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో కపిల్‌ దేవ్‌ ఈ సినిమా అంటే పెద్దగా ఆసక్తి చూపించలేదట.  తన పాత్రను రణ్‌వీర్‌పోషిస్తున్నాడనీ, తన భార్య రోమీ పాత్రను దీపిక పోషిస్తుందని తెలుసుకొని పెద్దగా స్పందించలేదు.  ఈ విషయాన్ని కపిల్‌ ఇటీవల  వెల్లడిస్తూ ‘రణ్‌వీర్‌  సినిమాలు నేను  చూడలేదు. అందుకే అతను ఓ సాధారణ నటుడు అనుకొన్నాను. నా పాత్రకు అతను న్యాయం చేయగలడా అనిపించింది. కానీ అతన్ని కలసి, కొంతసేపు గడిపిన తర్వాత రణ్‌వీర్‌లో  ఎంత ప్రజ్ఞ ఉందో,  ఓ పాత్ర కోసం అతను  ఎంత కష్టపడతాడో అర్థమైంది. మొన్న జూన్‌, జులై నెలల్లో రోజుకు ఎనిమిది గంటలపాటు అతను క్రికెట్‌ స్టేడియంలోనే గడిపాడు. ఈ సందర్భంగా కొన్ని సార్లు అతను గాయపడ్డాడని విని బాధపడ్డాను’ అని చెప్పారు.


‘నన్ను క్లోజ్‌గా అబ్జర్వ్‌ చేయడం కోసం ఏడెనిమిది రోజులు నాతోనే ఉన్నాడు. నా ముందు ఓ కెమెరా పెట్టి, నేను ఎలా మాట్లాడతానో, ఎలా బిహేవ్‌ చేస్తానో, ఆఖరికి ఎలా తింటానో ప్రతిదీ షూట్‌ చేశాడు.ఓ పాత్ర కోసం ఎంతో తపించే నటుడిని రణ్‌వీర్‌లో చూశాను.  నా పాత్ర కోసం అతను చాలా కష్టపడ్డాడు’ అని అభినందించారు కపిల్‌.

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ 1983లో సాధించిన తొలి ప్రపంచ క్రికెట్‌ కప్‌ నేపథ్యంలో ‘83’ చిత్రకథ ఉంటుంది. నిజజీవితంలో దంపతులైన రణ్‌వీర్‌, దీపిక ఈ సినిమాలో సైతం దంపతులుగా నటించారు. క్రికెట్‌ అభిమానులు మెచ్చేరీతిలో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు కబీర్‌ ఖాన్‌.

Updated Date - 2020-11-22T05:53:45+05:30 IST