కాపులకు పెద్దపీట వేసింది వైఎస్‌ కుటుంబమే!

ABN , First Publish Date - 2021-08-01T06:50:11+05:30 IST

కాపులకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పెద్దపీట వేసింది వైఎస్‌ కుటుంబం మాత్రమేనని, సీఎం జగన్మోహన్‌రెడ్డి రెండేళ్లలో కాపుల సంక్షేమానికి రూ.12 వేల కోట్లు మంజూరు చేశారని మంత్రులు పేర్నినాని, కె.కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

కాపులకు పెద్దపీట వేసింది వైఎస్‌ కుటుంబమే!

కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన అడపా శేషగిరిరావు

రెండేళ్లలో రూ.12 వేలకోట్లు మంజూరు చేసిన సీఎం జగన్‌ 

వంగవీటి మోహనరంగా ఆశయాల స్ఫూర్తితో ముందడుగు

మంత్రులు పేర్నినాని, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, వెలంపల్లి

వన్‌టౌన్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కాపులకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పెద్దపీట వేసింది వైఎస్‌ కుటుంబం మాత్రమేనని, సీఎం జగన్మోహన్‌రెడ్డి రెండేళ్లలో కాపుల సంక్షేమానికి రూ.12 వేల కోట్లు మంజూరు చేశారని మంత్రులు పేర్నినాని, కె.కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా అడపా శేషగిరిరావుచే మంత్రి పేర్నినాని ప్రమాణ స్వీకారం చేయించారు. మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌) అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి నాని మాట్లాడుతూ సీఎం జగన్‌ కాపుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి వైపు పయనించాలన్నారు. మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడు తూ గత ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేశాయని, జగన్‌ కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అట్టడుగున ఉన్న కాపు సోదరులకు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా సముచిత స్థానాన్ని కల్పించిన ఘనత జగన్మోహన్‌రెడ్డికి చెందుతుందన్నారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నికులాలకు సముచితస్థానం కల్పించిన ఘనత పీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. కాపు చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అడపా శేషగిరిరావు మాట్లాడుతూసీఎం తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు కరీమున్నీసా, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్‌, అంబటి రాంబాబు, రక్షణనిధి, రోశయ్య, సీఎం కార్యక్రమాల కో-ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌, గుంటూరు, విజయవాడ నగర మేయర్లు మనోహర్‌ నాయుడు, రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజ, ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దొరబాబు, ఏపీ కాపు కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస శ్రీనరేష్‌, గుంటూ రు జిల్లా డీసీసీ చైర్మన్‌ రామ పాల్గొన్నారు.

కొవిడ్‌ నిబంధనలకు మంగళం!

ఒకపక్క ఉన్నతాధికారులతో కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ సమీక్షలు చేస్తూనే మరోవైపు నిబంధనలకు మంగళం పాడి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో కలిసి గుంపులు గుంపులుగా కలియతిరగటం పలు విమర్శలకు దారితీసింది. చైర్మన్‌గా అడపా శేషగిరిరావు ప్రమాణ స్వీకారం తరువాత పార్టీ నేతలు, కార్యకర్తలు నిబంధనలు గాలికొదిలేసి శేషగిరిరావును అభినందించేందుకు పెద్దఎత్తున సభావేదికపైకి దూసుకురావటంతో వేదిక నిండిపోయింది. అక్కడే ఉన్న మంత్రులు గానీ, కార్యకర్తలు గానీ వారించే ప్రయత్నం మాని ప్రేక్షక పాత్ర పోషించటంతో నేతలు, కార్యకర్తలు గుంపులు గుంపులుగా సభావేదికపైకి వెళ్లారు. 

Updated Date - 2021-08-01T06:50:11+05:30 IST