అమరావతి: ప్రమాదంలో కరకట్ట

ABN , First Publish Date - 2021-06-14T16:54:56+05:30 IST

కృష్ణ కరకట్ట వద్ద డ్రెడ్జింగ్ పనులవల్ల లంక గ్రామాలన్ని ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని..

అమరావతి: ప్రమాదంలో కరకట్ట

అమరావతి: కృష్ణ కరకట్ట వద్ద డ్రెడ్జింగ్ పనులవల్ల లంక గ్రామాలన్ని ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆందోళన చేస్తున్నారు. డ్రెడ్జింగ్ పేరుతో కరకట్టను తవ్వేస్తున్నారని, ఈ పనులను తక్షణమే నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కరకట్ట ప్రక్కను ఏడుచోట్ల ప్రభుత్వం డంపింగ్, స్టాక్ పాయింట్లు  ఏర్పాటు చేసి వేగంగా డ్రెడ్జింగ్ చేస్తోంది. దీనిపై రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కరకట్ట ప్రక్కన డంపింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తే కరకట్ట బలహీనపడుతుందని రైతులు తెలిపారు. అలా చేస్తే కరకట్ట బలహీనపడి గ్రామాలు వరద ముంపుకు గురయ్యే ప్రమాదముందన్నారు. కాంట్రాక్టర్ తమ ఇష్టానుసారం డ్రెడ్జింగ్ పనులు చేపడుతున్నట్లు రైతులు తెలిపారు. అసలు కరకట్టపై ఏం జరుగుతోందన్నదానిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబెట్ నిర్వహించింది. మరిన్ని వివరాల కోసం పై వీడియో క్లిక్ చేయండి..

Updated Date - 2021-06-14T16:54:56+05:30 IST