నేటి తరానికి మార్క్సిజం మార్గదర్శి

ABN , First Publish Date - 2021-05-06T05:50:01+05:30 IST

హక్కుల కోసం పోరాడే ప్రతి కార్మికునికి మార్క్సిజం పవిత్ర గ్రంఽథం లాంటిదని పలువురు వామపక్ష నాయకులు కొనియాడారు.

నేటి తరానికి మార్క్సిజం మార్గదర్శి
కారల్‌మర్క్స్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ తదితరులు

ఘనంగా కారల్‌మార్క్స్‌ జయంతి 

గుంటూరు(తూర్పు), మే 5: హక్కుల కోసం పోరాడే ప్రతి కార్మికునికి మార్క్సిజం పవిత్ర గ్రంఽథం లాంటిదని పలువురు వామపక్ష నాయకులు కొనియాడారు. మార్క్సిజం పిడి సూత్రం కాదని ఆచరణకు మార్గదర్శి అని అన్నారు. బుధవారం కారల్‌మార్క్స్‌ జయంతి కార్యక్రమంను సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ మార్క్స్‌ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కోటా మాల్యాద్రి, మరియదాస్‌, మంగా శ్రీనివాసరావు, దాసరి చిన్నోడు తదితరులు పాల్గొన్నారు.

 సీపీఎం కార్యాలయంలో...

సీపీఎం కార్యాలయంలో కారల్‌మార్క్స్‌ జయంతి కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు.. మార్క్స్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వేణుగోపాలరావు, కె.నళినీకాంత్‌, ఈమని ఆప్పారావు, ఎన్‌.వెంకటేశ్వర్లు, లక్ష్మణరావు, శ్రీనివాసరావు, అజయ్‌కుమార్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-06T05:50:01+05:30 IST