రక్తికట్టిన రాయబారం

ABN , First Publish Date - 2021-12-05T05:55:35+05:30 IST

పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో రెండో రోజు శనివారం రాయబారం ఘట్టాన్ని రసవత్తరంగా ప్రదర్శించారు.

రక్తికట్టిన రాయబారం
గ్రామంలో ఊరేగుతున్న కొణతాలు

కారంపూడి, డిసెంబరు 4: పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో రెండో రోజు శనివారం రాయబారం ఘట్టాన్ని రసవత్తరంగా ప్రదర్శించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొణతాలను నాగులేటిలోని గంగధార మడుగులో స్నానమాచరింపజేసి నూతన వస్త్రాలు ధరింపజేసి వీర్ల దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం సమర్పించారు. అనంతరం గ్రామోత్సవం జరిపి చెన్నకేశవస్వామి, అంకాళమ్మ ఆలయాల్లో తీర్థం స్వీకరించి బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద వీరాచారవంతులు కత్తిసేవ చేశారు. అనంతరం పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవ అయ్యవారు ఇంటివద్ద వీరావేశంతో ఊగిపోతున్న వీరాచారంతులకు పీఠాధిపతి తీర్థం ఇచ్చి శాంతింపజేశారు. అనంతరం దేవాలయానికి చేరుకోగా వీరావిద్యావంతులు రాయబారం కథను గానం చేశారు.  వీరాచార పీఠం నిర్వాహకులు బొగ్గరం విజయ్‌కుమార్‌ అయ్యవారు పర్యవేక్షించారు. 

Updated Date - 2021-12-05T05:55:35+05:30 IST