Abn logo
Aug 4 2020 @ 11:10AM

బాలీవుడ్ స్టార్స్‌పై కరణ్ ఆగ్రహం?

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీసింది. స్టార్ వారసులను తప్ప బయటి వారిని ఎదగనీయడని సామాన్యులు కూడా విమర్శలు చేసే పరిస్థితి తలెత్తింది. ఇంతటి సంక్షోభ సమయంలో తనకెవరూ అండగా నిలవకపోవడం కరణ్ జోహార్‌ను తీవ్రంగా బాధించిందట. 


బాలీవుడ్‌లోని ప్రముఖ హీరోలందరితోనూ కరణ్‌కు సత్సంబంధాలున్నాయి. ఎంతో మంది స్టార్ వారసులను కరణ్ వెండితెరకు పరిచయం చేశాడు. సోషల్ మీడియా వేదికగా తనపై తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతున్న సమయంలో వారెవరూ తనకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కరణ్‌కు బాధ కలిగించిందట. అందుకే చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను అనుసరించడం మానేశాడట. ఎవరితోనూ మాట్లాడకుండా దూరంగా ఉండిపోయాడట. 


Advertisement
Advertisement
Advertisement