Jul 24 2021 @ 11:19AM

Karan Johar: స‌ల్మాన్ వెర్సెస్ క‌రణ్

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌తో బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ పోటీ ప‌డబోతున్నారు. ఇంత‌కీ వీరి మ‌ధ్య పోటీ ఎందుకు? ఏ విష‌యంలో పోటీ ప‌డ‌బోతున్నార‌నే వివ‌రాల్లోకెళ్తే.. కరణ్ జోహార్ బిగ్‌బాస్ హోస్ట్‌గా మారుతున్నాడు. అదేంటి?  బిగ్‌బాస్ హోస్ట్ చేయ‌డానికి స‌ల్మాన్ ఖాన్ ఉన్నాడుగా! అనే సందేహం రావ‌చ్చు. అయితే క‌రణ్ జోహార్ బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోయేది ఓటీటీ మాధ్య‌మంలో. ఈ విష‌యాన్ని ఆయ‌నే తెలిపారు. ఓటీటీ మాధ్య‌మం ఊట్ బిగ్‌బాస్ రియాలిటీ షోను ఆరు వారాల పాటు నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేసింది. దీనికి క‌ర‌ణ్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఆగ‌స్ట్ 8 నుంచి ఇది ఊట్‌లో ప్ర‌సారం అవుతుంది. బిగ్‌బాస్ హోస్ట్‌గా ఇప్ప‌టికే అద‌ర‌గొడుతున్న స‌ల్మాన్‌ను క‌ర‌ణ్ జోహార్ త‌న స్టైల్‌లో మ‌రిపిస్తాడా?  లేదా బిగ్‌బాస్ ఓటీటీ తేలిపోతుందా?  అనేది తెలియాలంటే అగ‌స్ట్ వ‌ర‌కు ఆగాల్సిందే.