పాల సంఘం అధ్యక్షుడిగా కరణం సన్యాసినాయుడు

ABN , First Publish Date - 2021-06-24T05:46:52+05:30 IST

మార్టూరు పాల సంఘం అధ్యక్షుడిగా కరణం వెంకట సన్యాసినాయుడు ఎన్నికయ్యారు.

పాల సంఘం అధ్యక్షుడిగా కరణం సన్యాసినాయుడు
పాల సంఘం అధ్యక్షుడు సన్యాసినాయుడు

మార్టూరులోఆసక్తికరంగా సాగిన ఎన్నిక

అధికార పక్ష సభ్యుడ్ని వ్యతిరేకించిన డైరెక్టర్లు


తుమ్మపాల, జూన్‌ 23: మార్టూరు పాల సంఘం అధ్యక్షుడిగా కరణం వెంకట సన్యాసినాయుడు ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నిక ఆసక్తికరంగా సాగింది. బుధవారం సభ్యులతో సమావేశం నిర్వహించగా గ్రామ సర్పంచ్‌ కరణం రెవెన్యూనాయుడుతో పాటు నాయకులు వైసీపీ నేత కరణం నాగేశ్వరరావు పేరును అధ్యక్ష పదవికి సూచించారు. సభ్యుల నుంచి వ్యతిరేక వాతావరణం కనిపించడంతో వాయిదా వేసేందుకు సర్పంచ్‌, వైసీపీ నాయకులు ప్రయత్నించగా సభ్యులు తిప్పికొట్టారు. అధ్యక్ష పదవికి ఎన్నిక జరగాల్సిందేనని పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విశాఖ డెయిరీ అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. అధ్యక్ష పదవికి  పది మంది డైరెక్టర్లకుగాను ఒక్కరు మాత్రమే కరణం నాగేశ్వరరావుకు ఆమోదం తెలపగా, మిగిలిన ఏడుగురు డైరెక్టర్లు గ్రామానికి చెందిన కరణం వెంకట సన్యాసినాయుడుకు ఆమోదం తెలిపారు. డెయిరీ అధికారులు సన్యాసినాయుడును పాల సంఘం అధ్యక్షుడిగా ప్రకటించారు. దీంతో గ్రామంలో వైసీపీ నాయకులకు, పార్టీ ప్రతిష్టతకు చుక్కెదురైనట్టు అంతా చర్చించుకుంటున్నారు.

Updated Date - 2021-06-24T05:46:52+05:30 IST