గురుకుల విద్యార్థుల రికార్డు విన్యాసం

ABN , First Publish Date - 2021-12-07T05:00:38+05:30 IST

పెదతాడేపల్లి డాక్టర్‌ జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థులు ఓ అరుదైన రికార్డును నమోదు చేశారు. కరాటే కటా విభాగంలో ఏడాది నుంచి కసరత్తు చేస్తున్నారు

గురుకుల విద్యార్థుల రికార్డు విన్యాసం
కరాటేలో ఒకేసారి ప్రదర్శన ఇస్తున్న 500 మంది విద్యార్థులు

తాడేపల్లిగూడెం రూరల్‌ , డిసెంబరు 6 : పెదతాడేపల్లి డాక్టర్‌ జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థులు ఓ అరుదైన రికార్డును నమోదు చేశారు. కరాటే కటా విభాగంలో ఏడాది నుంచి కసరత్తు చేస్తున్నారు. అంబేడ్కర్‌ వర్థంతి సందర్భంగా సోమవారం తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దీనిని ప్రదర్శించారు. 500 మంది ఒకేసారి గాలిలో ఒకే విన్యాసం చేస్తూ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను సొంతం చేసుకున్నారు. ఈ ప్రదర్శన ద్వారా తమలో ఆత్మ విశ్వాసం మరింత పెరిగిందని విద్యార్థులు చెప్పారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.రాజారావు, సీఐ రవికుమార్‌, డీసీవో పి.సుజాత, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు ప్రతినిధి సాయిశ్రీ పర్యవేక్షించారు.  


Updated Date - 2021-12-07T05:00:38+05:30 IST