సైఫ్, కరీనాల చిన్న కొడుకు పేరు ‘జెహ్’... కన్ఫర్మ్ చేసిన రణధీర్ కపూర్!

కరీనా కపూర్ ఖాన్ రెండో కుమారునికి జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారికి ఏం పేరు పెట్టారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వీరి పెద్ద కుమారునికి తైమూర్ అని పేరు పెట్టినప్పుడు కూడా అభిమానులు ఎంతో ఆసక్తికనబరిచారు. దీంతో ఇప్పుడు వారు రెండో కుమారునికి ఎలాంటి పేరు పెడతారోనని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వారు తైమూర్ తమ్మునికి ‘జెహ్’ అనే పేరు పెట్టారని తెలుస్తోంది. దీనిని తైమూర్ తాత రణధీర్ కపూర్ స్పష్టం చేశారు. కాగా ‘జెహ’ అనేది హీబ్రూలో దేవుని పేరు. కరీనా కపూర్ ఫిబ్రవరి 21న రెండవ కుమారునికి జన్మనిచ్చింది. మార్చి 8న అస్పష్టంగా ఉన్న తమ కుమారుని ఫొటోను సోషల్ మీడియాలో కరీనా షేర్ చేసింది. సైఫ్, కరీనాలు తమ రెండవ కూమారునికి సంబంధించిన విషయాలను మీడియాకు దూరంగా ఉంచాలనుకున్నారు. 

Advertisement

Bollywoodమరిన్ని...