నిర్మానుష్యం

ABN , First Publish Date - 2021-05-06T06:08:39+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన కర్ఫ్యూ విధింపు జిల్లాలో సంపూర్ణంగా అమలైంది. మధ్యాహ్నం 12 నుంచి పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు వీధుల్లోకి వచ్చి దుకాణాలు మూసివేయించడం, ప్రైవేటు వాహనాలను ఆపడం, బైక్‌లపై వెళ్లే వారిని సైతం హెచ్చరించడంతో పట్టణ ప్రాంతాల్లో జనసంచారం తగ్గిపోయింది. రోడ్డుపై ఉండే చిరువ్యాపారాలు కూడా నిలిచిపోయాయి.

నిర్మానుష్యం
జన సంచారంలేని ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌

 జిల్లా అంతటా పగటిపూట కర్ఫ్యూ అమలు

12 గంటలకే అన్ని కార్యకలాపాలు బంద్‌

నిలిచిన ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు

అత్యవసరాలకే అనుమతి, జనసంచారానికి బ్రేక్‌

ఒంగోలులో  కర్ఫ్యూను పర్యవేక్షించిన ఎస్పీ

ఒంగోలు, మే 5 (అంధ్రజ్యోతి) : 

జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. కరోనా ఉధృతి నేపథ్యంలో నియంత్రణ కోసం బుధవారం నుంచి రాష్ట్రప్రభుత్వం పగటిపూట కూడా కర్ఫ్యూ విధింపు నిర్ణయం నేపథ్యంలో జిల్లాలో అధికారులు తదనుగుణ చర్యలు చేపట్టారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వ్యాపార, వాణిజ్య ఇతరత్రా కార్యకలాపాలు కొనసాగాయు. అనంతరం మొత్తం మూతపడ్డాయి. ఇప్పుటికే రాత్రిపూట కర్ఫ్యూ ఉండగా తాజా పరిస్థితితో మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6గంటల వరకు అన్ని ఆపేశారు. అత్యవసరాలైన ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, పాలు, పెట్రోల్‌, డీజిల్‌ బంకులు వంటివి మాత్రమే పనిచేయగా అన్నిరకాల వ్యాపార, వాణిజ్య, విద్యా, ఇతరత్రా సంస్థలు మూతపడ్డాయి. ప్రజారవాణాలో ప్రధానమైన ఆర్టీసీ బస్సులను కూడా అధికారులు నిలిపేశారు. జిల్లావ్యాప్తంగా 8డిపోల పరిధిలో 700పైగా సర్వీసులు ఉండగా కేవలం 200 సర్వీసులు మాత్రమే తిరుగుతున్నట్లు సమాచారం.

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన కర్ఫ్యూ విధింపు జిల్లాలో సంపూర్ణంగా అమలైంది. మధ్యాహ్నం 12 నుంచి పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు వీధుల్లోకి వచ్చి దుకాణాలు మూసివేయించడం, ప్రైవేటు వాహనాలను ఆపడం, బైక్‌లపై వెళ్లే వారిని సైతం హెచ్చరించడంతో పట్టణ ప్రాంతాల్లో జనసంచారం తగ్గిపోయింది. రోడ్డుపై ఉండే చిరువ్యాపారాలు కూడా నిలిచిపోయాయి. దీంతో జిల్లాలో ప్రధాన పట్టణాలైన ఒంగోలు, చీరాల, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఇతరత్రా ప్రాంతాలతోపాటు మండలకేంద్రాలు మధ్యాహ్నానికి నిర్మానుష్యంగా మారాయి. కొన్నిప్రాంతాల్లో ప్రభుత్వం కార్యాలయాలు, బ్యాంకులు పనిచేయగా చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాల్లోని గ్రానైట్‌ క్వారీలు, ఫ్యాక్టరీలు అలాగే గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లోని ఫ్యాక్టరీలు బుధవారం యఽథావిధిగానే సాగాయి. గురువారం నుంచి కొన్ని షిప్టులు తగ్గించే ఆలోచనలో యజమానులు ఉన్నట్లు సమాచారం. 


స్వచ్ఛందంగా మూత

జిల్లాలోని చాలాప్రాంతాల్లో గతవారం నుంచే పాక్షిక లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే ఎక్కడికక్కడే స్థానిక వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించారు తప్ప అధికారులవైపు నుంచి అంతగా వత్తిడి లేదు. కాగా ప్రస్తుతం వివిధ శాఖల అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు సైతం రోడ్డుపైకి వచ్చి నియంత్రణ చర్యలు చేపట్టారు. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి స్థానిక అధికారులుతో కలిసి రోడ్లుపై తిరిగి ప్రజలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఒంగోలులో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ బైక్‌పై నగరంలో పర్యటించి కర్ప్యూ అమలును పర్యవేక్షించారు. అలాగే పలుచోట్ల స్థానిక పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ అధికారులు, సిబ్బంది నియంత్రణ చర్యల్లో పాల్గొన్నారు. కాగా కర్ఫ్యూ అమలు కారణంగా ఆర్టీసీ బస్సులు 12 గంటలు తర్వాత పూర్తిగా నిలిచిపోగా ప్రైవేటు కార్లు, ఆటోలు 90శాతం ఆగిపోయాయి. 


సాయంత్రానికి కొద్దిగా సంచారం..


ఇక పట్టణాల్లో నిత్యావసరాలు, వస్త్ర, చెప్పులు, హోమ్‌నీడ్స్‌, నగలు, ఇతరత్రా వ్యాపారాలతోపాటు కూరగాయలు, మటన్‌, చికెన్‌, పండ్ల మార్కెట్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, సినిమా థియేటర్లు ఇతరత్రా అన్నిరకాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. టీ దుకాణాలు, టిఫిన్‌ బండ్లు, పూలు, పండ్లు వంటి చిన్న వ్యాపారాలు కూడా ఆగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో జనసంచారం, బైక్‌ల రాకపోకలు కనిపించాయి. అయితే వారిని అడ్డుకోవడం లాంటి చర్యలు ఏమి పోలీసులు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో కొన్ని సెంటర్లు, వీఽధుల్లో, నగర శివారుల్లో, బైపా్‌సలపై యువకులు బైక్‌లపై యథేచ్ఛగా తిరగడం కనిపించింది. 






Updated Date - 2021-05-06T06:08:39+05:30 IST