ఏం చేసిన మీ వెంటే...ఈటలతో అభిమానులు

ABN , First Publish Date - 2021-05-04T17:07:02+05:30 IST

ఈటల క్యాంప్ కార్యాలయానికి అభిమానులు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈటల అందరితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.

ఏం చేసిన మీ వెంటే...ఈటలతో అభిమానులు

కరీంనగర్: ఈటల క్యాంప్ కార్యాలయానికి అభిమానులు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈటల అందరితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ‘‘ఏం చేద్దాం అంటూ అభిమానులకు ప్రశ్న వేయగా...ఏం చేసినా మీ వెంటే ఉంటామని నియోజకవర్గ  నేతలు‘‘ ఈటలకు స్పష్టం చేసినట్లు సమాచారం.


మరోవైపు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈటల ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్‌పై పోరుకు ఈటల రాజేందర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-05-04T17:07:02+05:30 IST