Abn logo
May 5 2021 @ 11:59AM

తెరపైకి ఈటల మద్దతుదారుల కొత్త నినాదం

కరీంనగర్: రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వివాదంలో మరో కొత్త నినాదం తెరపైకి వచ్చింది. గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ కూడా రాజీనామా చేయాలని ఈటల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు హుజురాబాద్‌‌లో ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలిపారు. ఇద్దరూ కలిసి పోటీ చేస్తే అసలు ఓనర్ ఎవరో తెలుస్తుందని... ఎవరు గెలిస్తే వారే నిజమైన ఓనర్లని అన్నారు. ఉద్యమంలో కేసీఆర్, ఈటల ఇద్దరిదీ ఒకే స్థాయి అని చెప్పుకొచ్చారు. కాగా తమ నేతపై మంత్రులు చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఈటలకు లేదని మద్దతుదారులు స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement