Abn logo
Aug 2 2021 @ 08:17AM

Karimnagar: వీణవంకలో విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న కారు..వ్యక్తి మృతి

కరీంనగర్: జమ్మింకుటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్‎లో ఉన్న కారుకు స్కూటీ అడ్డం రావడంతో కారు స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థంభాన్ని కారు ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. స్థంభాన్ని కారు ఢీకొట్టిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన వీణవంకలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.