Abn logo
Sep 3 2021 @ 07:48AM

Karimnagar: షార్ట్ సర్క్యూట్‎తో దగ్ధం అయిన కారు

కరీంనగర్: తిమ్మాపూర్ టోల్‎ప్లాజా వద్ద షార్ట్ సర్క్యూట్‎తో కారు దగ్ధం అయింది. హైదరాబాద్ నుండి కరీంనగర్ వస్తున్న కారులో తిమ్మాపూర్ టోల్‎ప్లాజా దగ్గరికి రావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారు పక్కకు ఆపి కారులో మంటలు ఆపేందుకు ప్రయత్నించాడు. అప్పటికే కారులోంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి కారు మంటల్లో దగ్ధం అయ్యింది.