BJPకి ఓటు వేశారని..కోపంతో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ధర్నా

ABN , First Publish Date - 2021-11-08T16:35:37+05:30 IST

వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. తమ గ్రామంలోని వడ్లను కొనుగోలు చేయడం లేదంటూ రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. అధికార పార్టీ

BJPకి ఓటు వేశారని..కోపంతో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ధర్నా

కరీంనగర్: వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. తమ గ్రామంలోని వడ్లను కొనుగోలు చేయడం లేదంటూ రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు సంబంధించిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రెడ్డిపల్లి గ్రామం రైతులు మండిపడుతున్నారు. మా ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడంలేదని అడిగితే..మీరు బీజేపీకి ఓటు వేశారని..అందుకే మీ ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ, అధికార పార్టీ వ్యక్తులు రైతులపై మండిపడుతున్నారని గ్రామ రైతులు తెలిపారు. దీంతో గ్రామ రైతులు రోడ్డు మీదకు వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-11-08T16:35:37+05:30 IST