శ్రామికవర్గ సైనికుడు కారల్‌ మార్క్స్‌

ABN , First Publish Date - 2021-05-06T05:21:58+05:30 IST

ప్రపంచ దేశాల్లోని శ్రామిక, కార్మిక వర్గాల వారి హక్కుల కోసం నిరంతర పోరాటం చేసిన శ్రామిక వర్గ సైనికుడు కారల్‌ మార్క్స్‌ అని ప్ర జా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్‌ అన్నారు.

శ్రామికవర్గ సైనికుడు కారల్‌ మార్క్స్‌
వనపర్తిలో మార్క్స్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న టీజేఏసీ నాయకులు

- ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్‌

వనపర్తి టౌన్‌, మే 5: ప్రపంచ దేశాల్లోని శ్రామిక, కార్మిక వర్గాల వారి హక్కుల కోసం నిరంతర పోరాటం చేసిన శ్రామిక వర్గ సైనికుడు కారల్‌ మార్క్స్‌ అని ప్ర జా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కశాళాల మైదానంలో బుధవా రం  టీజేఏసీ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో ర చయిత కారల్‌ మార్క్స్‌ జయంతిని ఘనంగా జరుపుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దగాప డుతున్న జనానికి వెన్నుదన్నుగా నిలిచి, శ్రామిక వర్గా నికి సైనికుడై, పెట్టుబడి దారుల వెన్నులో వణుకు పుట్టించిన ఈ కాలపు యుగపురుషుడు మార్క్స్‌ అని అన్నారు. వ్యవస్థ, సృష్టి ఉన్నంత కాలం వీరబ్రహ్మేం ద్రస్వామి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, కారల్‌ మార్క్స్‌లు పేద, బడుగు, బలహీన, కార్మిక, కర్షక వర్గాల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీజే ఏసీ నాయకులు గిరిరాజాచారి, తగవుల వెంకట స్వామి, పానుగంటి నాగన్న, బాలు టీ, భాష, విద్యార్ధి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

సీపీఎం కార్యాలయంలో...

కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక సృష్టి కర్త కారల్‌ మార్క్స్‌ 203వ జయంతిని సీపీఎం పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని పార్టీ కార్యాలయంలో కారల్‌ మార్క్స్‌ చిత్రప టానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పిం చారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ మాట్లాడుతూ పెట్టుబడిదారి రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చి కార్మిక వర్గ రాజ్యాస్థాపనే లక్ష్యంగా సిద్దాంతాలను బోధిచిన వ్యక్తి కారల్‌ మార్క్స్‌ అని అన్నారు. 1848లో కమ్యూనిస్టు మ్యానిఫెస్టో రూపొం దించి, 1867లో క్యాపిటల్‌ పెట్టుబడి గ్రంధాన్ని రాసి విడుదల చేశారని అన్నారు. ఆయన సిద్దాంతాల ఆధా రంగానే 1917లో సోషలిస్టు విప్లవం, 1949లో చైనాలో, 1959లో క్యూబాలో, 1975లో వియత్నం, ఉత్తర కొరియా, లావోస్‌ వంటి అనేక దేశాల్లో నేటికి ప్రజలు సోషలిజం అనుభవిస్తున్నారని, కార్మిక వర్గ రాజ్యాం నడుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పుట్ట ఆంజనేయు లు, డీ.కురుమయ్య, నందిమళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T05:21:58+05:30 IST