రైతులకు సంఘీభావంగా పెళ్లికి ట్రాక్టర్‌పై వచ్చిన వరుడు

ABN , First Publish Date - 2020-12-04T22:54:03+05:30 IST

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఓవైపు ఆందోళనలు కొనసాగిస్తుంటే..

రైతులకు సంఘీభావంగా పెళ్లికి ట్రాక్టర్‌పై వచ్చిన వరుడు

కర్నల్: కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఓవైపు ఆందోళనలు కొనసాగిస్తుంటే తాను ఊరేగింపుగా వెళ్లడం ఇష్టంలేని  ఓ పెళ్లికొడుకు సాదాసీదా రీతిలో ట్రాక్టర్‌లో వివాహ మండపానికి తరలి వెళ్లాడు. హర్యానాలోని కర్నల్‌కు చెందిన పెళ్లికొడుకు సొంతగా వ్యాపారం చేసుకుంటున్నాడు. లగ్జరీ కారు కూడా ఉంది. అయితే, తన కుటుంబ మూలాలన్నీ సేద్యంతో ముడిపడి ఉన్నాయని, రైతులకు సంఘీభావంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని పెళ్లికొడుకు తెలిపాడు. దేశానికి రైతే వెన్నెముక అని, వారిని గౌరవించాల్సింది పోయి గడ్డకట్టించే చలిలో వారిపై వాటర్ క్యానన్లు ప్రయోగించారని, తన చర్యతో రైతులకు ప్రజల మద్దతు ఉందనే సందేశం పంపదలచుకున్నామని చెప్పాడు.


పెళ్లికొడుకు తల్లి శిశిల మాట్లాడుతూ, సాదాసీదాగా పెళ్లి జరిపించి,  ఖర్చుల కోసం అనుకున్న సొమ్ములో పొదుపు చేసిన మొత్తాన్ని రైతులకు విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. రైతులకు ఆహార సదుపాయం కల్పించడం కోసం గురువాద్వారా లాంగర్లకు (వెడ్డింగ్ హాల్స్) ఇస్తామని చెప్పింది.

Updated Date - 2020-12-04T22:54:03+05:30 IST