దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతోన్న కరోనా వ్యాప్తి ప్రభావం థియేటర్లపై కనిపిస్తోంది. కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాలని గురువారం తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ధనుష్ కథానాయకుడుగా నటించిన ‘కర్ణన్’ చిత్రం కూడా 50 శాతం ఆక్యుపెన్సీతోనే ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కలైపులి ఎస్. థాను ప్రకటించారు. ‘‘కర్ణన్ రేపు థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులందరూ ప్రభుత్వ మార్గదర్శకాలు, కరోనా జాగత్తలు పాటిస్తూ సినిమా చూడాలని కోరుతున్నాను’’ అని ట్వీట్ చేశారు. మారీ సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ధనుష్ సరసన ఐశ్వర్యాలక్ష్మి హీరోయిన్గా నటించారు.