Abn logo
Sep 26 2021 @ 23:46PM

వీరభద్రస్వామి సేవలో కర్ణాటక సీఎం ఓఎస్డీ

గోసంరక్షణశాలలో గోపూజ నిర్వహిస్తున్న దృశ్యం

రాయచోటి, సెప్టెంబరు 26: భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని ఆదివారం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్డీ కర్ణాటక ఎక్స్‌ అఫిషియో జాయింట్‌ సెక్రటరీ బీపీ చెన్నబసవేశ కుటుంబ సమేతంగా దర్శించకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆలయ ఈవో మంజుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శంకరయ్య, కృష్ణయ్య స్వాములు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.  అనంతరం స్వామి వారి గోసంరక్షణాశాలలో గోపూజ చేసి గోశాలలో మొక్కలు నాటి నీరు పోశారు.  ఆయనను వీరశైవ జంగమ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అందెల బాలయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమమంలో వీరశైవ జంగమ సంక్షేమ సంఘం నాయకులు శశిధర్‌, శ్రీనివాస్‌, శివశరణ్‌ తదితరులు పాల్గొన్నారు.