Abn logo
Sep 28 2020 @ 16:49PM

డ్రగ్స్ కేసులో శాండల్‌వుడ్ భామలకు చుక్కెదురు

Kaakateeya

బెంగళూరు: కర్ణాటకలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన శాండల్‌వుడ్ తారలు సంజనా, రాగిణి ద్వివేదిలకు బెయిల్ విషయంలో చుక్కెదురైంది. వీరు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక కోర్టు కొట్టేసింది. వీరితో పాటు.. సంజనా స్నేహితుడు రాహుల్ బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.


ఇదిలా ఉంటే.. శాండల్‌వుడ్‌లో ఈ డ్రగ్స్ వ్యవహారం వెండితెరకు మాత్రమే పరిమితం కాలేదు. బుల్లితెరకూ మాదకద్రవ్యాల మత్తు తగిలింది. యాంకర్ అకుల్ బాలాజీ ఇటీవలే బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణను ఎదుర్కోగా, తాజాగా.. కన్నడ యాంకర్ అనుశ్రీని కూడా డ్రగ్స్ కేసులో మంగళూరు సీసీబీ పోలీసులు విచారించారు. డ్యాన్సర్, బాలీవుడ్ నటుడు కిశోర్‌శెట్టితో పాటు అతడి మిత్రుడు తరుణ్‌లను ఇప్పటికే మంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి అనుశ్రీ స్నేహితురాలు. వీరంతా మంగళూరుకు చెందినవారే కావడం గమనార్హం. కిశోర్‌శెట్టి నిర్వహించిన అనేక పార్టీలలో డ్రగ్స్ వాడినట్లు పోలీసులకు సమాచారం ఉంది. వీటిలో కొన్ని పార్టీలలో అనుశ్రీ పాల్గొన్నట్టు తెలిసింది. ఈ పార్టీల గురించే అనుశ్రీని సీసీబీ పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం.


Advertisement
Advertisement
Advertisement