వీసా నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురు విదేశీయుల అరెస్ట్

ABN , First Publish Date - 2020-08-04T15:01:57+05:30 IST

చెల్లుబాటయ్యే పాస్‌పోర్టులు లేకుండా వీసా నిబంధనలను ఉల్లంఘించిన ఏడుగురు విదేశీయులను బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు....

వీసా నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురు విదేశీయుల అరెస్ట్

బెంగళూరు (కర్ణాటక): చెల్లుబాటయ్యే పాస్‌పోర్టులు లేకుండా వీసా నిబంధనలను ఉల్లంఘించిన ఏడుగురు విదేశీయులను బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని హెన్నూర్, బనాస్ వాడీ ప్రాంతాల్లోని 35 ప్రాంతాల్లో క్రైంబ్రాంచ్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో విదేశీయుల నుంచి నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశీయులను అరెస్టు చేసి వారిని దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు సిటీ జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ చెప్పారు. 

Updated Date - 2020-08-04T15:01:57+05:30 IST