Karnataka: కరోనా ఆంక్షల సడలింపు

ABN , First Publish Date - 2021-07-24T17:26:52+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్న కొవిడ్ ఆంక్షలను రేపటినుంచి సడలించాలని సర్కారు నిర్ణయించింది....

Karnataka: కరోనా ఆంక్షల సడలింపు

రేపటినుంచి ప్రార్థనాలయాలు, పార్కులు పునర్ ప్రారంభం

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్న కొవిడ్ ఆంక్షలను రేపటినుంచి సడలించాలని సర్కారు నిర్ణయించింది. దేవాలయాలు , మసీదులు, చర్చ్ లు, గురుద్వారాలు, ఇతర మతపరమైన ప్రదేశాలు, పార్కులను ఆదివారం నుంచి తెరిచేందుకు అనుమతిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ భక్తులు దేవాలయాలు, మసీదులు, చర్చ్ లు, గురుద్వారాలకు రావచ్చని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కర్ణాటక రాష్ట్రంలో అమ్యూజ్ మెంట్ పార్కులు కూడా తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


 అయితే వాటర్ స్పోర్ట్సు, అడ్వెంచర్ కార్యకలాపాలను మాత్రం అనుమతించమని సెక్రటరీ స్పష్టం చేశారు.సినిమాహాళ్లను తెరిచేందుకు కర్ణాటక సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ఫ్యూ సమయాన్ని గంట సమయాన్ని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటకలో కళాశాలలు, విశ్వవిద్యాలయాలను జులై 26వ తేదీ నుంచి తెరిచేందుకు సర్కారు అనుమతించింది. కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కరోనా ఆంక్షలను సర్కారు సడలించింది.

Updated Date - 2021-07-24T17:26:52+05:30 IST