కర్ణాటక: హైవేలపై ఎమ్మెల్యేలకు వీఐపీ లైన్

ABN , First Publish Date - 2021-09-16T22:46:30+05:30 IST

కొద్ది రోజుల క్రితం ఈ విషయమై కొంత మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశ్నించారు. టోల్ ప్లాజాల వద్ద తమ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని, తమ సెక్యూరిటీ వెళ్లి ఎమ్మెల్యే వాహనం అని చెప్పినప్పటికీ తమ వాహనాల్ని స్కాన్ చేస్తున్నారని

కర్ణాటక: హైవేలపై ఎమ్మెల్యేలకు వీఐపీ లైన్

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ రోడ్లలో ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ఇక నుంచి అంబులెన్స్‌కు కేటాయించిన వీఐపీ లైన్ నుంచి అనుమతి ఉంటుందని కర్ణాటక ప్రజా కార్యకలాపాల శాఖ మంత్రి సీసీ పాటిల్ బుధవారం అసెంబ్లీలో తెలిపారు. టోల్ ప్లాజా వద్ద తమకు చాలా సమయం వృధా అవుతోందంటూ కొంత మంది ఎమ్మెల్యేలు పెట్టిన విజ్ణప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.


‘‘రాష్ట్ర రహదారులన్నీ రెండు వరుసల రోడ్లే. నాలుగు వరుసల రోడ్లు లేవు. కాబట్టి ఎమ్మెల్యేల కోసం ప్రత్యేకంగా వీఐపీ లైన్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ప్రస్తుతం అంబులెన్స్‌ల కోసం ఉన్న వీఐపీ లైన్‌ను ఎమ్మెల్యేలు ఉపయోగించుకోవచ్చు. దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తాం’’ అని సీసీ పాటిల్ అన్నారు.


కొద్ది రోజుల క్రితం ఈ విషయమై కొంత మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశ్నించారు. టోల్ ప్లాజాల వద్ద తమ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని, తమ సెక్యూరిటీ వెళ్లి ఎమ్మెల్యే వాహనం అని చెప్పినప్పటికీ తమ వాహనాల్ని స్కాన్ చేస్తున్నారని వాపోయారు. ఈ వియషమై స్పందించిన కర్ణాటక అసెంబ్లీ స్పీకర్.. 224 మంది ఎమ్మెల్యేలు ఈ సమస్య ఎదుర్కొంటున్నారని, అయితే దీనిపై చర్చ జరగాలని అన్నారు. కాగా, అంబులెన్స్ దారిని ఉపయోగించుకోవచ్చని మంత్రి సీసీ పాటిల్ బుధవారం తెలియజేయడం గమనార్హం.

Updated Date - 2021-09-16T22:46:30+05:30 IST