కర్ణాటక మద్యం, గుట్కా, గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-06-18T05:14:51+05:30 IST

తవణంపల్లె మండలంలోని మూడు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి రూ.50 లక్షలు విలువైన గుట్కా, కర్ణాటక మద్యం, గంజాయిని స్వాధీనం చేసుకొని పది మందిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఈబీ ఏఎస్పీ రిశాంత్‌రెడ్డి తెలిపారు.

కర్ణాటక మద్యం, గుట్కా, గంజాయి స్వాధీనం
పట్టుబడ్డ గుట్కా, మద్యం, గంజాయి, నిందితులతో పోలీసులు

10 మంది అరెస్టు


తవణంపల్లె, జూన్‌ 17: తవణంపల్లె మండలంలోని మూడు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి రూ.50 లక్షలు విలువైన గుట్కా, కర్ణాటక మద్యం, గంజాయిని స్వాధీనం చేసుకొని పది మందిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఈబీ ఏఎస్పీ రిశాంత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన స్థానిక పోలీసుస్టేషన్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. మండలంలోని జి.గొల్లపల్లె క్రాస్‌, పట్రపల్లె, గాజలపల్లె, ఎల్‌ఎన్‌పురం గ్రామాల సమీపంలో మద్యం, గుట్కా, గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. రూ.50 లక్షలు విలువైన 57 కేసుల కర్ణాటక మద్యం, రెండు కిలోల గంజాయి, 118 బస్తాల గుట్కాతో పాటు మూడు కార్లు, ఒక ఆటో, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. ఇందుకు సంబంధించి అరగొండకు చెందిన కిరణ్‌కుమార్‌(36), కట్టకిందపల్లెకు చెందిన నవీన్‌(31), ఎ.గొల్లపల్లెకు చెందిన జయప్రకాష్‌(28), సరకల్లుకు చెందిన రామరాజు(32), పట్రపల్లెకు చెందిన శ్రీనివాసులు(36), జి.గొల్లపల్లెకు చెంది ఆంజినేయులు నాయుడు(56), బంగారుపాళ్యం మండలానికి చెందిన ధనశేఖర్‌(32), అమరనాథరెడ్డి(41), తిరుపతి కొర్లగుంటకు చెందిన వెంకటనారాయణ(32), జీడీ నెల్లూరు మండలం వేల్కూరుకు చెంది నీరజ్‌(23)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు వివరించారు. ఈ సమావేశంలో డీఎస్పీ సుధాకరరెడ్డి, వెస్టు సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:14:51+05:30 IST