Advertisement
Advertisement
Abn logo
Advertisement

చితకబాది నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగించి.. నిందితుడికి శిక్ష విధించిన స్థానికులు.. విషయం పోలీసుల ద‌ృష్టికి వెళ్లడంతో..

బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని దారుణంగా శిక్షించారు. విచక్షణా రహితంగా కొట్టారు. రద్దీగా ఉండే జంక్షన్‌లో నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తమకు ఫిర్యాదు చేయకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దారుణ శిక్షను విధించిన వ్యక్తుల గురించి పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు. 


కర్ణాటకలోని హసన్ జిల్లాలోని మహారాజా పార్క్‌కు మేఘరాజ్‌ అనే వ్యక్తి తరచుగా వెళ్తుండేవాడు. బుధవారం సాయంత్రం ఆ పార్క్‌లో ఒంటరిగా ఉన్న బాలికతో మేఘరాజ్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని స్థానికులు గమనించారు. అతడిపై దాడికి తెగబడ్డారు. అతడిని చితక్కొట్టారు. అనంతరం అతడిని నగ్నంగా మార్చి రద్దీగా ఉండే హేమావతి సర్కిల్ వద్ద ఊరేగించారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మేఘరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే మేఘరాజ్‌పై దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement