పోస్ట్‌మార్టం గదిలో డాక్టర్‌కు షాక్! ఇక లేవడనుకుంటే.. అకస్మాత్తుగా..

ABN , First Publish Date - 2021-03-04T01:48:45+05:30 IST

ఆ యువకుడు బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు భావించారు. పోస్ట్ మార్టం కోసం సిద్ధమవుతున్నారు. ఇంతలో ఓ డాక్టర్..టేబుల్‌పై ఉన్న యువకుడి దేశాన్ని తాకాడు. వెంటనే యువకుడి దేశంపై రోమాలు నిక్కపోడుచుకున్నాయి. వేళ్లు కదిలాయి.. వారు డాక్టర్లు కాబట్టి జస్ట్ షాకైపోయారు. వారి స్థానంలో మరొకరు ఉండి ఉంటే..పైప్రాణాలు పైనే పోయి ఉండేవి. ఈ షాకింగ్ ఘటన బాగల్‌కోట్‌లో జరిగింది.

పోస్ట్‌మార్టం గదిలో డాక్టర్‌కు షాక్! ఇక లేవడనుకుంటే.. అకస్మాత్తుగా..

బెంగళూరు: ఆ యువకుడు బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు భావించారు. పోస్ట్ మార్టం కోసం సిద్ధమవుతున్నారు. ఇంతలో ఓ డాక్టర్..టేబుల్‌పై ఉన్న యువకుడి దేశాన్ని తాకాడు. వెంటనే యువకుడి దేశంపై రోమాలు నిక్కపోడుచుకున్నాయి. వేళ్లు కదిలాయి! వారు డాక్టర్లు కాబట్టి జస్ట్ షాకైపోయారు. వారి స్థానంలో మరొకరు ఉండి ఉంటే..పైప్రాణాలు పైనే పోయి ఉండేవి! ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో జరిగింది. బెళగావికి చెందిన శంకర్ గోంబి అనే యువకుడు ఫిబ్రవరి 27న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికంగా ఉన్న ఆస్పత్రికి అతడిని హుటాహుటిన తరలించగా.. అక్కడి డాక్టర్లు అతడిని రెండు రోజుల పాటు వైద్యం చేసి.. ఇక లాభం లేదని తేల్చేశారు. బ్రెయిడ్ డెడ్ అయిందని, వెంటిలేటర్ తొలిగించగానే శంకర్ తుది శ్వాస విడుస్తాడని అతడి కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వారు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో వైద్యులు పోస్ట్‌మార్టం నిమిత్తం..శంకర్‌ను సోమవారం నాడు మహాలింగ్‌పూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఎస్ గాలిగలి అనే డాక్టర్‌కు పోస్టంమార్టమ్ నిర్వహించే బాధ్యతను అప్పగించారు. 


ఆయన పోస్ట్‌మార్టం ప్రారంభించే సమయంలో శంకర్‌ను తాకగా అతడి రోమాలు నిక్కపొడుచుకున్నట్టు డాక్టర్ గుర్తించారు. వెంటనే అతడి వెంటిలేటర్ తొలగించగానే శంకర్ తన వేళ్లను కూడా కదిపాడు. పల్స్ ఆక్సీమీటర్‌తో పరీక్ష చేయిగా నాడి కొట్టుకోవడం కూడా డాక్టర్ గుర్తించారు. దీంతో ఆయన శంకర్ కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో పాటూ శంకర్‌ను మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నా 18 ఏళ్ల వృత్తి జీవితంలో ఇటువంటి ఘటనను ఎప్పుడూ చూడలేదు అని గాలిగలి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా.. శంకర్ ప్రస్తుతం వైద్యానికి స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే..అతడు బ్రెయిడ్ డెడ్ అని చెప్పిన ఆస్పత్రిపై ఇంకా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని సమచారాం. వృత్తిపరమైన నిర్లక్ష్యం పదర్శించనందుకు సదరు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలా లేదా అనే విషయాన్ని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయిస్తారని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2021-03-04T01:48:45+05:30 IST