Abn logo
Sep 25 2021 @ 21:10PM

భార్య చేసిన అవమానాన్ని భరించలేక.. వీడియో పోస్ట్‌లో బంధువును నిందించి..

ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఓ 25ఏళ్ల వ్యక్తి.. అర్థాంతరంగా తనవు చాలించాడు. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య చేసిన అవమానం భరించలేకే ప్రాణాలను తీసుకుంటున్నట్లు ఫోస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోలో వెల్లడించాడు. తన చావుకు తన బంధువే బాధ్యుడు అని ఆరోపించాడు. కర్నాటకలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వార్త స్థానికంగా ప్రస్తుతం చర్చనీయాంశం అయింది.


కర్నాటకలోని బొమ్మనహళ్లి ప్రాంతానికి చెందిన వెంకటేశ్ దోరెనహళ్లీ (25) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన.. భార్య చేసిన అవమానం తట్టుకోలేకే ప్రాణాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కొంత కాలంగా తన భార్య.. శ్రీశైల్ (బంధువు) అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఇద్దరినీ హెచ్చరించిన్నట్లు వెల్లడించారు. అయితే హెచ్చరికలను తన భార్య లెక్కచేయలేదని వాపోయారు. అంతేకాకుండా శ్రీశైల్‌తో కలిసి వెళ్లిపోయినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో ఆత్మహత్యకు పూనుకుంటున్నట్లు వెల్లడించారు. తన మృతికి బాధ్యుడు శ్రీశైలే అని ఆ వీడియో పేర్కొన్నాడు. 


కాగా.. వెంకటేశ్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు గుర్తించిన కొందరు స్థానికులు.. అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో వెంకటేశ్ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...