చివరిసారి... మనసారా ఎప్పుడు నవ్వానో?

ABN , First Publish Date - 2022-02-01T15:39:19+05:30 IST

నమస్కారం.. నా పేరు నగేష్. నేను కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లావాసిని. గత మూడేళ్లుగా Lymphedema Elephantiasis (బోదకాలు) అనే సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నాను.

చివరిసారి... మనసారా ఎప్పుడు నవ్వానో?

నమస్కారం.. నా పేరు నగేష్. నేను కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లావాసిని. గత మూడేళ్లుగా Lymphedema Elephantiasis (బోదకాలు) అనే సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నాను.


మొదట్లో నా కాళ్ళ మీద లేచిన గడ్డలు కంటికి దాదాపుగా కనిపించేవి కావు. కానీ, ఏళ్లు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఆపరేషన్ చెయ్యకపోతే నేను నడవలేనని చెప్పారు.


ఈ లింక్ పై క్లిక్ చేసి నగేష్‌కు సాయం చెయ్యండి..


నా కాళ్ల మీదున్న చర్మంపైన 2018 నుంచీ గడ్డలు రావడం మొదలైంది. నాకు 5 సంవత్సరాల వయస్సున్నప్పుడే నా తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. దాంతో ఒక కుటుంబం లేక... ఉండటానికి ఇల్లు లేక నేను రోడ్ల మీదే తిరుగుతూ పెరిగాను.


రోజులో ఒక పూట భోజనం దొరకడం కూడా చాలా కష్టంగా మారింది. నా కాళ్ల మీద పెరుగుతున్న ఇన్ఫెక్షన్ గురించి నేను పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు. సహాయం పొందడానికి నాకు కుటుంబం గాని, బంధువులు గాని లేరు.


ఈ లింక్ పై క్లిక్ చేసి నగేష్‌కు సాయం చెయ్యండి..


అయితే, ఒక రోజున నేను రోడ్డు మీద పడి ఉండటం చూసి... అదృష్టవశాత్తు సుమనహళ్లి ట్రస్ట్ వారు నన్ను తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆ అనాథాశ్రమం వారు నాకొక నీడ, తోడు ఇచ్చారు. వారే ఇప్పుడు నా కుటుంబం. కానీ, నా కాళ్ల పరిస్థితి మాత్రం రోజు రోజుకూ క్షీణిస్తూనే ఉంది.


ఈ బోదకాలు సమస్య వల్ల నేను అతి కష్టం మీద నడిచేవాడిని. ఒకొక్క అడుగూ వేస్తుంటే... తీవ్రమైన వాపు వల్ల నా కాలు ఎంతగా బరువెక్కిపోయిందో అర్థమైంది. కనీసం 3 ఆపరేషన్లు చేస్తేనే వ్యాధి తగ్గి నా పరిస్థితి మెరుగవుతుందని డాక్టర్లు ఒక నిర్ణయానికి వచ్చారు.


ఈ మొత్తం వైద్య ప్రక్రియకు, మందులకు కలిపి సుమారుగా రూ. 30,00,000 వరకూ ఖర్చవుతుంది. ఒక పూట భోజనానికే నానా పాట్లు పడే నాలాంటివాడి చికిత్సకు ఇంత పెద్ద మొత్తం సమకూర్చుకోవడం ఊహలోనేనా సాధ్యపడుతుందా.... చెప్పండి.


ఈ లింక్ పై క్లిక్ చేసి నగేష్‌కు సాయం చెయ్యండి..


సుమారుగా పదేళ్ళకు పైగా తిండి కోసం వెదుక్కుంటూ రోడ్ల మీదే తిరిగి, అక్కడే బతికాను. ఏదైనా ఉద్యోగం చూసుకుని బతుకుదామంటే, అవతలివారి కళ్లు నా పాదాలపై పడగానే నన్ను తిరస్కరించేవారు.


సుమనహళ్లి ట్రస్ట్ వారు నన్ను, నా భావాలను, నేను పడుతున్న బాధను అర్థం చేసుకుని నన్ను ఎంతో ఆదరించారు. అక్కడ నేను బార్బర్‌గా పని చేస్తూ చాలా కొద్దిగానే సంపాదించేవాడిని కానీ, అది నా మనస్సుకి సంతృప్తి కలిగించే ఆదాయమని చెప్పాలి.


చివరిసారిగా నేను ఎప్పుడు మనసారా నవ్వానో నాకే గుర్తు లేదు. అసలు నేను ఒక మామూలు మనిషిలా బతకలేనేమోనని అనిపిస్తుంటుంది. ఆర్థికంగాను... వ్యక్తిగాను... ఒక స్వతంత్రుడిగా నన్ను నేను చూసుకోవాలని అనుకుంటున్నాను.


నేను కచ్చితంగా కోలుకుంటానని డాక్టర్లు నమ్మకంగా చెబుతుండడం నాలో ఆశలు రేపుతోంది. నా కాళ్ళకు స్వస్థత చేకూరాలంటే మూడు ఆపరేషన్లు జరగాలి. నేను ఎదుర్కుంటున్న ఈ సమస్యకు శాశ్వతంగా ముగింపు పలికేలా దయచేసి నాకు సహకరించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.


నా కోసం విరాళం ఇచ్చి సాయం చెయ్యండి..


(ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఈ ఆస్పత్రి వైద్య బృందం తనిఖీ చేసి నిర్ధారించుకున్నది. నగేష్ చికిత్స, సంబంధిత ఖర్చుల సమాచారం కోసం ప్రచార నిర్వాహకులు లేదా వైద్య బృందాలను సంప్రదించవచ్చు. చారిటీ నెం: 81679551)


గమనిక: ఈ ఫండ్ రైజర్‌ కోసం ఇచ్చే డొనేషన్లకు 80G, 501(c) వంటి పన్ను మినహాయింపులు వర్తించవు.

Updated Date - 2022-02-01T15:39:19+05:30 IST