కర్ణాటక కళంకిత మంత్రి రాజీనామా

ABN , First Publish Date - 2021-03-03T19:53:01+05:30 IST

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి రమేశ్‌ జార్కిహొళి. కాంగ్రెస్‌, జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలను సమీకరించి వారితో తిరుగుబావుటా

కర్ణాటక కళంకిత మంత్రి రాజీనామా

బెంగళూరు: సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్న కర్ణాటక జలవనరులశాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత రమేశ్‌ జార్కిహొళి తన మంత్రి పదవికి బుధవారం రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మంగళవారం సాయంత్రం వీడియో సందేశం ద్వారా రమేష్ చెప్పినప్పటికీ.. పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడిల కారణంగా కావచ్చు.. బుధవారం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. కేపీటీసీఎల్‌లో (కర్ణాటక పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్‌టీ నగర్‌కు చెందిన యువతిని లొంగదీసుకున్న మంత్రి రమేశ్‌జార్కిహొళి ఆమెతో రాసలీలలు జరిపినట్టు తెలుస్తోంది. మంత్రి రమేశ్‌ జార్కిహొళి ఓ యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియోను దినేశ్‌ కల్లహళ్లీ అనే సామాజిక కార్యకర్త బెంగళూరు మీడియాకు విడుదల చేశారు.


ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభమైందని, మంత్రిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ కొనసాగుతుందని కర్ణాటక హోమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. ఉప ఎన్నికల ముంగిట శృంగార సీడీ బాంబు పేలడంతో బీజేపీ చిక్కుల్లో పడ్డటైంది. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ నుంచి మెరుపు వేగంతో కర్ణాటకలో దూసుకుపోతున్న బీజేపీకి ఇది గట్టి దెబ్బ అని అంటున్నారు.


కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి రమేశ్‌ జార్కిహొళి. కాంగ్రెస్‌, జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలను సమీకరించి వారితో తిరుగుబావుటా లేవనెత్తించి శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయించిన సమయంలో రమేశ్‌ జార్కిహొళి అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఈయన ఒకనాడు కాంగ్రె్‌సకు చెందిన సీనియర్‌ నేత. కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక శాఖ నేతలతో విభేదించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి రావడానికి పక్కాగా పావులు కదిపారు. అలాంటి నేత వివాదంలో చిక్కుకోవడం ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడేసింది. మరోవైపు శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు ఈ అంశం అస్త్రం గా మారకముందే ఆయనతో రాజీనామా చేయించే అంశాన్ని బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు సమాచారం.



Updated Date - 2021-03-03T19:53:01+05:30 IST