Abn logo
Sep 27 2021 @ 01:21AM

America పర్యటనలో ప్రధాని Modi తో పాటు ఉన్న ఈ దంపతులు ఎవరంటే..

అమెరికాలో మోదీకి కర్ణాటకవాసి ఆతిథ్యం


బెంగళూరు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌లో 3 రోజులు గడిపిన ప్రధాని మోదీకి కర్ణాటకవాసి ఆతిథ్యమిచ్చారు. మోదీకి అవసరమైన ఆహార పదార్థాలను ఉడుపి జిల్లా కుందాపుర వాసి ఆనంద్‌ పూజారి సమకూర్చారు. ఆనంద్‌ 35 ఏళ్లుగా వాషింగ్టన్‌ డీసీలో నివసిస్తున్నారు. భార్య సునీతతో కలిసి 25 ఏళ్లుగా ఉడ్‌ల్యాండ్‌ హోటళ్లను నిర్వహిస్తున్నారు. భారత్‌ నుంచి అమెరికాకు వచ్చే ప్రముఖులకు గత కొన్నేళ్లుగా ఆయన ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానికి ఆనంద్‌ పూజారి నేతృత్వంలోని బృందం మూడోసారి ఆతిథ్యం సమకూర్చింది.


అమెరికాలో మోదీని ఆనంద్‌ పూజారి దంపతులు నాలుగుసార్లు కలిసినట్టు వారు అక్కడి మీడియాకు తెలిపారు. మోదీ అమెరికాలో ఉన్నా భారతీయశైలి వంటకాలకు ప్రాధాన్యమిచ్చేవారని, ప్రత్యేకించి దక్షిణ భారత రుచుల పట్ల ఆసక్తి చూపేవారన్నారు. అమెరికాలోనూ పూర్తి శాకాహార భోజనానికే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. తాను తరచూ స్వరాష్ట్రానికి వచ్చే వాడినని, కొవిడ్‌ వల్ల ఇటీవల రాలేదని ఆనంద్‌పూజారి తెలిపారు. సదరు కథనాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.