పట్టు వీడని కర్ణాటక ఆర్టీసీ కార్మికులు

ABN , First Publish Date - 2021-04-09T06:44:33+05:30 IST

కర్ణాటకలో ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రెండోరోజూ కొనసాగింది. ఆరవ వేతన కమిషన్‌ సిఫారసును అమలు చేయాలని, అందుకు అనుగుణంగా 30ు వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు

పట్టు వీడని కర్ణాటక ఆర్టీసీ కార్మికులు

కొనసాగుతున్న సమ్మె 


బెంగళూరు, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రెండోరోజూ కొనసాగింది. ఆరవ వేతన కమిషన్‌ సిఫారసును అమలు చేయాలని, అందుకు అనుగుణంగా 30ు వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. అంతస్థాయిలో వేతనాల పెంపునకు సర్కారు ససేమిరా అం టోంది. కార్మికులు సమ్మెకు దిగడంతో 8ు వేతనం పెంపునకు అంగీకరించిన ప్రభుత్వం రెండో రోజు 10ుకు పెంచి, అంతకు మించి వేతనాలు పెంచలేమ ని తేల్చి చెప్పింది. కార్మికుల హక్కులను కాలరాసేలా ప్రభుత్వపెద్దలు నిర్ణయాలు తీసుకోరాదని ఆర్టీసీ కార్మికుల ఐక్యసంఘాల కూటమి అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్‌ అన్నారు. కార్మిక సంఘాలతో చర్చలకు ముఖ్యమంత్రి యడియూరప్ప ససేమిరా అన్నారు. ఏడాది పాటు కరోనా కష్టకాలంలోను వేతనాలు చెల్లించామని, నష్టాల్లో ఉన్న సంస్థను ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంటే నిరసనల పేరుతో కార్మికులు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడాన్ని క్షమించలేమన్నారు. రవాణా మంత్రి లక్ష్మణసవది కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సమ్మె సరికాదన్నారు.

Updated Date - 2021-04-09T06:44:33+05:30 IST