కర్నాటకలో రికార్డు స్థాయికి కరోనా కేసులు.. ఒక్కరోజులో..

ABN , First Publish Date - 2020-08-05T02:51:53+05:30 IST

కర్నాటకలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ కొత్తగా 6,259 మందికి..

కర్నాటకలో రికార్డు స్థాయికి కరోనా కేసులు.. ఒక్కరోజులో..

బెంగళూరు: కర్నాటకలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ కొత్తగా 6,259 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. రాష్ట్రంలో ఒకేరోజు ఇన్ని పాజిటివ్ కేసులు రావడం ఇదే తొలిసారి. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,45,830కి పెరిగినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడచిన 24 గంటల్లో మరో 110 మంది ఈ మహమ్మారికి బలికావడంతో... మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,704కి చేరింది. కాగా కరోనా బారి నుంచి ఇవాళ 6,777 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 69,272కి చేరింది. ప్రస్తుతం 73,846 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో 73,212 పరిస్థితి నిలకడగా ఉండగా.. 634 మంది ఐసీయూల్లో చికిత్స పొందున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-08-05T02:51:53+05:30 IST