లెజిస్లేచర్స్ హౌస్‌లోకి రావద్దు...జర్నలిస్టులపై అసెంబ్లీ స్పీకర్ నిషేధాస్త్రం

ABN , First Publish Date - 2020-02-22T18:10:06+05:30 IST

కర్ణాటక రాష్ట్ర శాసనసభ స్పీకర్ జర్నలిస్టులపై నిషేధాస్త్రాన్ని ప్రయోగించారు. జర్నలిస్టులు లెజిస్లేచర్స్ హౌస్ లోపలకు ప్రవేశించకుండా నిషేధ ఉత్తర్వులను....

లెజిస్లేచర్స్ హౌస్‌లోకి రావద్దు...జర్నలిస్టులపై అసెంబ్లీ స్పీకర్ నిషేధాస్త్రం

బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర శాసనసభ స్పీకర్ జర్నలిస్టులపై నిషేధాస్త్రాన్ని ప్రయోగించారు. జర్నలిస్టులు లెజిస్లేచర్స్ హౌస్ లోపలకు ప్రవేశించకుండా నిషేధ ఉత్తర్వులను  కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కజేరి జారీ చేశారు. ఈ మేర స్పీకర్ తాజాగా అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. ‘‘ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్టులు ఎప్పుడూ లెజిస్లేచర్స్ హౌస్ లోపలకు ప్రవేశించ రాదు’’ అంటూ స్పీకర్ ఆదేశాల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నపుడు శాసనసభ్యులు లెజిస్లేచర్స్ హౌస్ కు వస్తుంటారని, జర్నలిస్టులు లెజిస్లేచర్స్ హౌస్ కు వచ్చి వారిని కలుస్తూ వారి గోప్యతకు భంగం కలిగిస్తున్నందున ఈ నిషేధం విధించామని స్పీకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైనా జర్నలిస్టులతో మాట్లాడాలి అనుకుంటే లెజిస్లేచర్స్ హౌస్ గేటు బయట ఏర్పాట్లు చేశామని స్పీకర్ జారీ చేసిన నోటిఫికేషన్ లో సూచించారు. జర్నలిస్టులు, కెమెరామెన్లు విధానసౌధా సమీపంలోని లెజిస్లేచర్స్ హౌస్ లోకి అనుమతించేది లేదని స్పీకర్ జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేశారు.

Updated Date - 2020-02-22T18:10:06+05:30 IST