COVID threat : కేరళ,మహారాష్ట్రల నుంచి బెంగళూరు వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు

ABN , First Publish Date - 2021-08-02T17:45:11+05:30 IST

పొరుగు రాష్ట్రాలైన కేరళ, మహారాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం అప్రమత్తమైంది....

COVID threat : కేరళ,మహారాష్ట్రల నుంచి బెంగళూరు వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు

బెంగళూరు (కర్ణాటక): పొరుగు రాష్ట్రాలైన కేరళ, మహారాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం అప్రమత్తమైంది. కర్ణాటకలో కరోనా కట్టడికి రాష్ట్ర సరిహద్దుల్లో సోమవారం నుంచి చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేసింది. కరోనా పీడిత కేరళ, మహారాష్ట్రల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘాకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. కేరళ, మహారాష్ట్రలో నుంచి బెంగళూరు వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరపాలని బృహత్ బెంగళూరు మహానగరపాలిక చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరు నగరంలోని జోనల్ కమిషనర్లు, ఇన్ స్పెక్టర్లు, రెవెన్యూ డిపార్టుమెంట్ సిబ్బంది అన్ని ఎంట్రీ పాయింట్లలో ప్రయాణికులను తనిఖీలు చేయాలని చీఫ్ కమిషనర్ ఆదేశించారు. 


ప్రయాణికుల వద్ద 72 గంటలకు ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ చూపించాలని, లేకుంటే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించారు.రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, మైసూర్ రోడ్ శాటిలైట్ బస్ టెర్మినల్, యశ్వంత్ పూర్ రైల్వేస్టేషన్, కెంగెరి శాటిలైట్, శివాజీనగర్  బస్ టెర్మినల్, కంటోన్మెంట్, కేఆర్ పురం  రైల్వేస్టేషన్లు వచ్చే ప్రయాణికులను తనిఖీలు చేయాలని నిర్ణయించారు.కర్ణాటకలో ఆదివారం 1875 కరోనా కేసులు నమోదు కాగా 25 మంది మరణించారు. దీంతో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అధికారులను ఆదేశించారు.


Updated Date - 2021-08-02T17:45:11+05:30 IST